స్మిత్ చేతికి ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ ప‌గ్గాలు?

-

ఆస్ట్రేలియా క్రికెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా తిరిగి స్టీవ్ స్మీత్ ను నియ‌మించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జ‌ట్టు కు టీమ్ ఫైన్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే ఇటీవ‌ల టీమ్ ఫైన్ ఒక వివాదం లో చిక్కు కున్నాడు. ఒక అమ్మాయి తో సెక్స్ చాటింగ్ చేసిన ఘ‌ట‌న బ‌య‌ట‌కు రావ‌డంతో టీమ్ ఫైన్ టెస్టె కెప్టెన్ బాధ్య‌త ల నుంచి త‌ప్ప‌కున్నాడు.

దీంతో ప్ర‌స్తుతం ఆ స్థానంలో స్టీవ్ స్మీత్ ను కెప్టెన్ గా నియ‌మించాల‌ని ఆస్ట్రేలియా క్రికెట్ భావిస్తుంది. అయితే స్టీవ్ స్మీత్ ఇప్ప‌టికే ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ జట్టు కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. కాని 2018 లో సౌత్ ఆఫ్రికా తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ చోటు చేసుకోవ‌డం తో స్టీవ్ స్మీత్ పై రెండు సంవ‌త్స‌రాలు ఆస్ట్రేలియా క్రికెట్ నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version