BCCI కీలక నిర్ణయం.. ఉప్పల్‌ స్టేడియానికి రూ117 కోట్ల నిధులు

-

భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ సమయంలో వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ ఏర్పాట్లు మొదలుపెట్టింది బీసీసీఐ. ఇందులో భాగంగా.. ఈ మెగాటోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేసేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం కూడా ఉండటం విశేషం.

వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్​తో పాటు దిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియం, కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌, మొహాలీ పీసీఏ స్టేడియం, ముంబయి వాంఖడే స్టేడియాల్లో కనీస సౌకర్యాలు లేవని అభిమానుల నుంచి ఫిర్యాదులు వస్తుండటం వల్ల వాటికి మరమ్మతులు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం బీసీసీఐ సుమారు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. హైదరాబాద్‌ ఉప్పల్​ స్టేడియానికి రూ.117.17 కోట్లు కేటాయించినట్లు తెలిసింది.

దిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌కు రూ.127.47 కోట్లు, మొహాలీ పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, ముంబయి వాంఖడే స్టేడియానికి రూ.78.82 కోట్లు కేటాయించనుంది. అయితే మొహాలీలో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు లేకపోయినా అక్కడి మైదానాన్ని రెనోవేట్​ చేయాలని బోర్డు నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version