ఆస్ట్రేలియా వెళ్ళిన ఆటగాళ్ళందరికీ కరోనా టెస్ట్.. ఏం తేలిందంటే?

ఐపీఎల్ ముగిసిన మరునాడే ఆస్ట్రేలియా పయనమైన భారత జట్టు 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా క్వారంటైన్ తప్పట్లేదు. అంతే కాదు కరోనా టెస్ట్ కంపల్సరీ అయ్యింది. భారత ఆటగాళ్ళందరికీ కరోనా టెస్ట్ చేసారట. అదృష్టవశాత్తు ప్రతీ ఒక్కరికీ నెగెటివ్ వచ్చిందని సమాచారం. అందువల్ల ఆటగాళ్ళందరూ ప్రాక్టీస్ కోసం ఆరుబయటకి వచ్చారు.

ఆరుబయట మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలని బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. హనుమ విహారి, మహమ్మద్ సిరాజ్, టి నటరాజన్, రవీంద్ర జడేజా, షార్దూల్ ఠాకూర్ ల ఫోటోలు జిమ్ లో చెమటలు చిందిస్తూ, మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత జరగబోతున్న ఆసీస్ టూర్ పై క్రికెట్ అభిమానులందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు.