ఐపీఎల్ లో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్… చెన్నై, బెంగళూర్ ల మధ్య ఆసక్తికర పోరు

-

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 29 మ్యాచులు జరిగితే కేవలం 9 మ్యాచుల్లోనే ఆర్సీబీ గెలుపొందింది. 2018 నుంచి చూస్తే ఆర్సీబీ 2 సార్లు గెలిస్తే… సీఎస్కే 7 విజయాలు సాధించింది. మరోవైపు చెన్నై సారథ్యం  బాధ్యతలు ధోని తీసుకోవడంతో జట్టు మరింత స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. మరోవైపు బెంగళూర్ జట్టులో కోహ్లీ కూడా ఫామ్ లోకి వచ్చాడు. గత మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. పూణే వేదికగా ఈ మ్యాచ్  జరుగనుంది. పూణేలో చివరిసారిగా సీఎస్కే, ఎస్ ఆర్ హెచ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో హైస్కోర్ నమోదైంది. మొత్తంగా కలిసి రెండు జట్లు 391 రన్స్ చేశాయి. తేమ శాతం తక్కువగా ఉండటంలో ఈ రోజు మ్యాచ్ లో కూడా హైస్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version