నేటి నుంచి ఇండియా ఓపెన్.. ఆశాలన్నీ సింధు, శ్రీ‌కాంత్ పైనే

-

గత రెండు సంవ‌త్స‌రాల నుంచి క‌రోనా కార‌ణంగా వాయిదా పడుతూ వ‌స్తున్న ఇండియా ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్ నుంచి హాట్ ఫేవ‌రేట్ గా పీవీ సింధు, కిదాంబి శ్రీ‌కాంత్ బ‌రిలో దిగుగుత‌న్నారు. వీరితో పాటు ప‌లువ‌రు స్టార్ ప్లేయ‌ర్స్ ఇప్ప‌టికే న్యూ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ మెగా టోర్నీ నేటి నుంచి ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అయితే క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతున్న నేప‌థ్యంలో క‌ఠిన ఆంక్ష‌ల మ‌ధ్య ఈ టోర్నీని నిర్వ‌హిస్తున్నారు. బ్యాడ్మింట‌న్ కోర్టులో కేవలం ఆట‌గాళ్లు, సిబ్బంది మాత్ర‌మే ఉండ‌నున్నారు.

వీక్ష‌కుల‌కు అనుమ‌తి పూర్తిగా నిషేధించారు. క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాల నుంచి ప‌లువురు స్టార్ ప్లేయర్స్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్ర‌పంచ మెన్స్ ఛాంపియ‌న్  కియ‌న్ వీ (సింగాపూర్) తో పాటు మ‌లేషియా ప్లేయ‌ర్స్ ఒంగ్ వి సిన్, టియో యియి ఉన్నారు. అలాగే ఇండియోసియా ఛాంపియ‌న్లు మ‌హ‌మ్మ‌ద్ అసాన్, హెండ్రా సెతివాన్ తో పాటు ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్స్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియానికి చేరుకున్నారు. కాగ క‌రోనా సోకి పలువురు ఈ మెగా టోర్నీకి దూరం అయ్యారు. ఇండియా నుంచి సాయి ప్ర‌ణీత్ కూడా కరోనా సోక‌డంతో ఈ మెగా టోర్నీకి దూరం అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version