IPL 2023 : లక్నో సంబరాలు.. ప్లేయర్ల డ్యాన్స్

-

లక్నో సూపర్ జెయింట్స్ మరో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ విజయం కోసం రింకు సింగ్ ఆఖరి బంతి వరకు చేసిన పోరాటం వృధా అయ్యింది. యష్ థాకూర్ అసాధారణ బౌలింగ్ తో లక్నోకు విజయం అందించాడు. ఈ గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కేకేఆర్ నిర్నీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి ఓటమిపాలైంది. రింకు సింగ్ కు తోడుగా జాసన్ రాయ్ రాణించాడు. అయితే.. ప్లేఆఫ్స్ కు వెళ్లడంతో లక్నో టీం సంబరాలు చేసుకుంటుంది. నిన్న కేకేఆర్ పై ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో 1 రన్ తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ కన్ఫామ్ చేసుకుంది. ఈ క్రమంలో లక్నో ఫ్రాంచైజీ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. పూరన్, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్నోయ్ డ్యాన్స్ చేస్తూ వీడియోకు ‘ప్రస్తుతం మూడ్ ఇలా ఉంది’ అని క్యాప్షన్ పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version