IPL 2024: రోహిత్‌ శర్మ ఆడాలి..ముంబై ఓడిపోవాలి !

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో నిన్న ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఓటమి చెందడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మాను పక్కకు పెట్టినందుకు ముంబైకి ఇలాగే జరగాలని పోస్టులు పెడుతున్నారు.రోహిత్ శర్మ రన్స్ చేయాలి… కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోవాలి అనేది తమ నినాదం అని చెబుతున్నారు రోహిత్ శర్మ ఫ్యాన్స్.

rohit sharma vs pandya

నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ 43 రన్స్ చేశారు. అప్పటివరకు ఫుల్ జోష్ లో ఉన్న రోహిత్ శర్మ ఫ్యాన్స్… ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో సంబరాలు చేసుకున్నారు. కాగా ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ అది నుంచి ఇబ్బంది పడ్డది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version