IND VS CAN: మ్యాచ్ రద్దవడంపై మాజీల సీరియస్‌

-

IND VS CAN: మ్యాచ్ రద్దవడంపై మాజీలు సీరియస్‌ అయ్యారు. మైదానాన్ని పూర్తిగా కప్పడానికి కవర్లు లేని చోట ICC మ్యాచ్ లు నిర్వహించకూడదని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించారు. నిన్న వర్షం తగ్గి గంటలు గడిచినా లాడర్ హిల్ స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో భారత్, కెనడా మ్యాచ్ రద్దవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Sunil Gavaskar slams ICC after India vs Canada gets abandoned

పిచ్ ను కవర్ చేసి మైదానాన్ని వదిలేయకూడదని చెప్పారు. ‘ఇంత డబ్బున్న ఔట్ ఫీల్డ్ తడిగా ఉందని మ్యాచ్ లా రద్దు సరికాదు’ అని మైకేల్ వాన్ అన్నారు. కాగా, మ్యాచ్కు ముందు వర్షం పడగా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో టాస్ కూడా వేయలేకపోయారు.2 సార్లు పిచ్ ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్ ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గ్రూప్-ఏ నుంచి ఇండియాతో పాటు యూఎస్ఏ కూడా సూపర్-8కు అర్హత సాధించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version