టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్‌.. యువీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. క్రికెట్‌కు గుడ్‌బై..!

-

భార‌త క్రికెట్ అభిమానుల‌కు షాకింగ్ న్యూస్‌.. ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో ఓ వైపు భార‌త్ విజ‌యాల‌తో దూసుకెళ్తుంటే.. మ‌రో వైపు క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ త‌న క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. గ‌త కొంత సేప‌టి క్రిత‌మే యువీ మీడియాతో మాట్లాడుతూ.. త‌న రిటైర్మెంట్‌ను వెల్ల‌డించాడు. త‌న కెరీర్‌లో త‌న‌కు తోడుగా నిలిచిన కుటుంబ స‌భ్యులు, అభిమానుల‌కు యువీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా యువ‌రాజ్ సింగ్ కొంత‌సేపు భావోద్వేగానికి గుర‌య్యాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్ రోల‌ర్ కోస్ట‌ర్‌లా సాగింద‌ని యువీ అన్నాడు. అయితే ఇక‌పై క్రికెట్ ఆడ‌లేన‌ని నిశ్చ‌యించుకున్నాన‌ని.. అందుకే రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని యువీ తెలిపాడు. త‌న కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాల‌ను చూశాన‌ని.. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ ద‌శ వ‌చ్చేసింద‌ని చెప్పిన యువీ.. ఇక‌పై అన్ని ఫార్మాట్ల‌లోనూ క్రికెట్ ఆడ‌న‌ని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news