అమితానందంలో నమిత దంపతులు..ఘనంగా హీరోయిన్ సీమంతం

-

సీనియర్ హీరోయిన్ నమిత..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో ఈమె చేసిన సినిమాలన్నీ దాదపుగా సూపర్ హిట్ అయ్యాయి. వ్యాపారవేత్త వీరేంద్రను పెళ్లి చేసుకున్న నమిత..త్వరలో తల్లి కాబోతున్నది. ఈ నేపథ్యంలోనే తాజాగా నమితకు కుటుంబ సభ్యులు ఘనంగా సీమంతం నిర్వహించారు.

సంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు, బంధువులు నమితకు సీమంతం వేడుకు నిర్వహించారు. ఈ వేడుకలో నమిత తన భర్తతో హ్యాపీగా ఉంది. 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కాబోతున్నది. సీమంతం సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి బాగా వైరలవుతున్నాయి.

నమిత అభిమానులు ఈ ఫొటోలు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండంటి బిడ్డకు నమిత జన్మనివ్వాలని అంటున్నారు. నమిత తెలుగులో ‘సొంతం, జెమిని, బిల్లా, సింహ’ వంటి చిత్రాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news