ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్ లో శ్రీలంక దారుణంగా ఆడి కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే నీతిదారి పట్టింది. శ్రీలంక ఆడిన తొమ్మిది మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఆఖరి నుండి రెండవ స్థానానికి పడిపోయింది. ఇక శ్రీలంక దేశంలో ఉన్న ప్రభుత్వానికి మరియు శ్రీలంక క్రికెట్ బోర్డు కు మధ్యన విభేదాలు ఉండడంతో ఇటువంటి ఫలితం వచ్చింది అని కొందరు కామెంట్ లు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అందుకే శ్రీలంక క్రికెట్ బోర్డు ఐసీసీ ని ఒక విషయం కోరింది, ప్రస్తుతం ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు ను రద్దు చేయాలని రిక్వెస్ట్ చేసింది. శ్రీలంక ప్రభుత్వం పదే పదే బోర్డు వ్యవహారాలలో జోక్యం చేసుకుంటోందట.
ఈ విషయాన్నీ స్వయంగా శ్రీలంక క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు రవిన్ విక్రమరత్నే తెలియచేశారు. అందుకే ఐసీసీ శ్రీలంక బోర్డు పై నిన్న సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఈ విషయం చాలా వైరల్ గా మారింది.