పెట్రోల్‌ బంక్‌ వద్ద టీ, స్నాక్స్‌ సర్వ్ చేస్తున్న మాజీ క్రికెటర్‌.. కారణం అదే..

-

గత కొన్ని రోజులుగా శ్రీలంక పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ చికెన్‌ కాస్ట్‌ అంతట.. ఆయిల్‌ ధరలు అలా పెరిగియాట అని…ఊర్లో ఉండే వాళ్లు కూడా కోడే కూస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మరియు శ్రీలంక పార్లమెంటు మధ్య ఆధిపత్య పోరు కారణంగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తప్పు ఒకరిది అయితే శిక్ష మరొకరికి పడుతుందున్నట్లు.. శ్రీలంక ప్రజలు అక్కడి పరిస్థితికి బలవుతున్నారు..ఇటీవల జరిగిన హింసాత్మక అల్లర్ల వల్ల అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
ప్రస్తుతం ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వం సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంది. విదేశీ మారక నిల్వలు కూడా భారీగా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం ఒకింత కష్టంగానే మారింది. దీంతో ఇంధన సంక్షోభాన్ని సైతం తీవ్రస్థాయిలో ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఈ క్రమంలో అక్కడ కొత్త ప్రభుత్వం అనవసర ప్రయాణాలను తగ్గించుకోమని ప్రజలకు సూచిస్తుంది… అయినా ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదు.. అందువలన అక్కడ పెట్రోల్‌ బంక్‌ల వద్ద జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.

ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెటర్‌ రోషన్‌ సిరివర్ధనే మహానామా క్రికెట్‌ అభిమానులకు తెలిసే ఉంటుంది. శ్రీలంక తరపున 1996 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. టెస్ట్ చరిత్రలో డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లో మ్యాచ్ రిఫరీగా నిలిచిన మొదటి వ్యక్తి కూడా.. రోషన్ పెట్రోల్‌ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్‌ సర్వ్‌ చేస్తున్నాడు. ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొదట చూసినవారంతా.. క్రికెటర్‌కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అనుకున్నారు.. మ్యాటర్‌ మొత్తం చదివితే కానీ అసలు విషయం అర్థంకాలేదు. క్యూలో చాలాసేపు నిల్చొని ఉండటంతో వారికి బాగా ఆకలిగా ఉంటుంది. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన అవసరం ఎతైనా ఉందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్లు ఆయన తెలిపారు .
ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ప్రతి ఒక్కరిని తమ కోసం కాకపోయినా, ఇతరులు కోసమైనా ఆహార పదార్థాలు వెంట తీసుకెళ్లమని రోషన్‌ తెలిపారు. ఎవరికైన అత్యవసరమైతే నెంబర్‌ 1990కి కాల్‌ చేయమని సూచించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version