రైతులను ఆదుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల్లో సహాయం కోరుకునే వారికి గాంధీభవన్లో వార్ రూం ఓపెన్ చేశామని తెలిపారు. వరదల్లో సాయం కోరుకునేవారు ఫోన్ చేస్తే పార్టీ ఆదుకుంటుందని తెలిపారు.
ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితి లేదని, వాతావరణ శాఖ హెచ్చరించినా సీఎం కనీసం అప్రమత్తం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. గోదావరి ఇంకో మూడు అడుగులు పెరిగితే తీవ్ర నష్టం ఉంటుందని తెలిపారు. ములుగు ప్రాంతాల్లో ముంపు పెరుగుతుందని, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫోన్లు చేసినా కనీసం పట్టించుకోవడం లేదన్నారు.