తెలంగాణ BRS పార్టీలో కీలకంగా వ్యవహరించే ఇద్దరు నాయకులు తాటికొండ రాజయ్య మరియు కడియం శ్రీహరి ఇద్దరూ పరస్పరం వ్యక్తిగత దూషణలు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పంచాయితీ కాస్త సీఎం ద్రుష్టి వరకు తీసుకువెళ్ళమని కడియం శ్రీహరి కాసేపటి క్రితమే చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదంపై BRS అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందొ అని అర్ధం కాని పరిస్థితి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో నెలకొన్న ఈ రాజకీయ అనిశ్చితిపై BRS కార్యకర్తలు మరియు నాయకులు బాధలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు కేవలం అయిదు నెలలే ఉన్నందున ఏ విధంగా పరిస్థితి ఇక్కడ ప్రతిపక్షాలకు అనుకూలంగా మారుతుంది అని ఆలోచిస్తున్నారట. హై కమాండ్ ఎలాగైనా వీరిద్దరినీ పిలిపించి సమస్యను పరిష్కరించి ఇద్దరినీ కలపాలని కోరుతున్నారు.
స్టేషన్ ఘన్ పూర్: వారిద్దరి మధ్య ఫైట్… కార్యకర్తల్లో ఆందోళన .. !
-