భారత రక్షణ విభాగానికి చెందిన త్రివిద దళాల్లో రాడికల్ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకొచ్చింది. జూన్ 14వ తేదీన ప్రారంభించిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక నిరసనలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా బిహార్‌లో రెండు రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. పలు చోట్ల రైలు, రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భభువా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు అద్దాలను పగులగొట్టి రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ అనే బ్యానర్ పట్టుకుని కొత్త రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. బిహార్‌లోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రైల్వే ట్రక్‌పై ఫర్నీచర్ పడేసి తగులబెట్టారు. ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు.
आरा स्टेशन पर उग्र छात्रों को हटाने के लिए आश्रु गैस के गोले देखिए अब दागे जा रहे हैं @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/s0YP3bq1Tx
— manish (@manishndtv) June 16, 2022