మల్లె మాల సుదీర్ ను ఆపటం కాదు! సుధీర్ దే డిమాండ్!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పటి వరకు వీటి రేటింగ్స్ ను కొట్టే షో లు రాలేదంటే వీటిని స్టామినా అర్దం చేసుకోవచ్చు. అంతలా ఈ షోస్ తెలుగు ప్రజలను అలరిస్తూ వస్తున్నాయి. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. ఈ షో ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఇప్పుడు హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే.

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన  సినిమా గాలోడు  ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కూడా బ్రేక్ చేసి  లాభాలు తెచ్చి పెట్టింది.ఈ సినిమా పెట్టుబడికి రెట్టింపు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఈ సినిమా విజయం తో సుదీర్  వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ఉన్నాడు. ఇక జబర్థస్త్ లోకి మళ్లీ సుధీర్ ఎంట్రి ఉంటుంది అని కొంత మంది అంటుంటే లేదు మల్లె మాల వాళ్ళు పట్టించుకోవడం లేదని మరికొంత మంది అంటున్నారు.

వాస్తవానికి సుదీర్ మరియు రష్మి జోడీ ఉంటే రేటింగ్ ఎక్కడికో పోతుంది. మరి దానికి వాళ్ళు అడ్డు చెప్పే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక సుధీర్ గాలోడు సినిమా తో హిట్ కొట్టి జోరు మీద ఉన్నాడు. తనకి తక్కువ లో తక్కువ 50 లక్షలు నుండి కోటి రూపాయల దాకా అందుకొనే ఛాన్స్ ఉంది. అలాంటిది ఉన్నట్టుండి సుదీర్ సినిమా వదులు కొనే ప్రసక్తి లేదని తెలుస్తోంది. దీన్ని బట్టి మల్లెమాల ఆపే సిట్యువేషన్ లేదని, సుధీర్ డేట్స్ లేక మాత్రమే ఇలా ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version