జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సుధీర్.. ప్రోమో ద్వారా క్లారిటీ..!

-

జబర్దస్త్ కామెడీ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న సుధీర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా సుధీర్ తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను లతో కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా వీరికి ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు ఇకపోతే కొన్ని కారణాలవల్ల సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో రకరకాల వార్తలు వైరలయ్యాయి కొంతమంది స్టార్ మా చానల్ వాళ్లు ఎక్కువ పారితోషికం ఆఫర్ చేయడంతో జబర్దస్త్ ను వదిలేసాడు అని కొంతమంది అంటే మరి కొంత మంది లేదు సినిమాలలో అవకాశాలు రావడం వల్ల జబర్దస్త్ వదిలేశాడు అని ఇంకొంతమంది చెప్పారు. ఇకపోతే జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా రంగంలోకి దిగి సుధీర్ మోసం చేశారు అని.. తిండికి కూడా లేని సమయంలో ఇబ్బందులు పడుతుంటే మేమే ఆశ్రయం ఇచ్చాము అంటూ అసలు విషయం తెలిపారు ఏడుకొండలు.

ఇక ఇలా రోజురోజుకు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎవరూ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎట్టకేలకు జబర్దస్త్ లోకి సుదీర్ రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తాజాగా ఒక ప్రోమో ను వదిలి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక సుధీర్ రీ ఎంట్రీ పై శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సుధీర్ హోస్ట్ గా చేస్తుండగా అతడు వేరే ఛానల్ కి జంప్ చేయడంతో ప్రస్తుతం యాంకర్ రష్మితో నడిపిస్తున్నారు. ప్రస్తుతం యాంకర్ రష్మీకి బీభత్సమైన హైప్ ఇస్తూ ఆమె బయోగ్రఫీతో ఎమోషనల్ ప్రోమో కూడా వదిలారు. పనిలో పనిగా జబర్దస్త్ ను విడిచి వెళ్లిపోయిన వారిపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఇకపోతే ప్రేక్షకులలో ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక తాజాగా ప్రోమో ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ తో పాటు వెళ్లిపోయిన ప్రతి ఒక్కరిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం మల్లెమాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక అందులో భాగంగానే హింట్ ఇస్తూ ప్రోమో కూడా వదిలినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికైతే సుదీర్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version