సుకుమార్ 1000 కోట్లు.. దేవరకొండ 200 కోట్లు.. ఏమైనట్టో!

-

లైగర్​ సినిమా ఎందుకు అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయిందో వివరించారు ప్రముఖ ఫిల్మ్​ట్రేడ్​ అనలిస్ట్​ కరన్​ తౌరాని. ఈ సినిమా లైఫ్​టైమ్​ కలెక్షన్స్ ఎంత వస్తాయో అంచనా వేశారు. ఆ వివరాలు.

పూరీ జగన్నాథ్ విజయ్

‘వెయ్యికోట్లు పక్కా’, ‘రూ.200 కోట్లా.. ఇది చాలా తక్కువ, ఇండియా షేక్​ అవుతది’ ఈ వ్యాఖ్యలు దాదాపుగా ప్రతీ సినీప్రేక్షకుడికి గుర్తుండే ఉంటాయి. ‘లైగర్’​ సినిమా కలెక్షన్స్​ను ఉద్దేశిస్తూ.. మొదటిది దర్శకుడు సుకుమార్​ అనగా, రెండోది హీరో విజయ్​ దేవరకొండ అన్నారు. ప్రస్తుతం సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఈ మాటలే మీమ్స్​ రూపంలో తెగ కనిపిస్తున్నాయి. ఎందుకంటే భారీ అంచనాలతో విడుదలైన రౌడీహీరో లైగర్ మూవీ.​. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కలెక్షన్స్​ పరంగా కూడా బాగా నిరాశపరిచింది. దీంతో ఈ మీమ్స్​ బాగా వైరల్​ అవుతున్నాయి.

విజయ్ లైగర్

మరోవైపు ఈ సినిమా కలెక్షన్స్​ గురించి ఫిల్మ్​ ట్రేడ్​ అనలిస్ట్​ కరన్​ తౌరాని(karan taurani) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలి రోజు వసూళ్లను, టాక్​ను ఆధారంగా చేసుకుని.. మొత్తంగా ఈ చిత్రం రూ.55 నుంచి 60కోట్లు మాత్రమే వసూలు చేస్తుందని అంచనా వేశారు. అందులో రూ.10కోట్లు బాలీవుడ్​ నుంచి వస్తాయని అన్నారు.

కరణ్ విజయ్

“సినిమా రిలీజ్​ కాకముందు ఈ చిత్రం లైఫ్​టైమ్​ కలెక్షన్స్​ రూ.170-180కోట్లు సాధిస్తుందని, అందులో 25శాతం బాలీవుడ్ బాక్సాఫీస్​ నుంచి వస్తుందని అంచనా వేశాం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ మూవీ లైఫ్​టైమ్​ ఫిగర్​ రూ.55-60కోట్లు మాత్రమే వసూళ్లను అందుకుంటుందని తెలుస్తోంది. మంచి కంటెంట్​, రియలిస్టిక్​ వీఎప్​ఎక్స్​ ఉంటేనే సినిమాలు బాక్సాఫీస్​ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంటాయి. ఇండస్ట్రీ కంటెంట్ విషయంలో మార్పులు చేసుకుంటేనే కష్టాల్లో నుంచి బయటపడుతుంది. ఎందుకంటే ఎలాంటి కంటెంట్ ఉన్న చిత్రాన్ని థియేటర్లో చూడాలనే విషయమై ప్రేక్షకులు స్పష్టతతో ఉన్నారు” అని కరన్​ అన్నారు.

లైగర్

కాగా, బాక్సింగ్ నేపథ్యంలో లైగర్​ సినిమాను దర్శకుడు పూరిజగన్నాథ్ తెరకెక్కించారు. అనన్య పాండే హీరోయిన్​. రమ్యకృష్ణ, దిగ్గజ బాక్సర్​ను కీలక పాత్ర పోషించారు. సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనిష్‌ భాగ్చి సంగీతమందించారు. సినిమాటోగ్రఫీ- విష్ణు శర్మ, ఎడిటింగ్‌- జునైద్‌ సిద్ధిఖీ. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ మూవీని రూపొందించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version