Suma: “సుమ అడ్డా” కోసం ఎంత పారితోషకం తీసుకుంటుందో తెలుసా..?

-

బుల్లితెర యాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమా కనకాల గురించి.. ఆమె వాక్చాతుర్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..స్టేజ్ పై ఎక్కి మైకు పట్టిందంటే చాలు నిరంతరం ప్రేక్షకులకే కాదు సెలబ్రిటీలకు కూడా వినోదాన్ని పంచుతూ సందడి చేస్తూ ఉంటుంది. అందుకే ఒక్క బుల్లితెర షోలలోనే కాదు సినిమా ఈవెంట్లకు కూడా ఈమె ముఖ్య యాంకర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇక ఈమె చేయని సినిమా ఆడియో ఫంక్షన్ లేదంటే అతిశయోక్తి కాదు. అంతే కాదు అప్పుడప్పుడు పెద్దపెద్ద సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో విషయాలను అభిమానులకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోని మొన్నటి వరకు క్యాష్ ప్రోగ్రామ్ తో ప్రేక్షకులను, సెలబ్రిటీలను అలరించిన సుమ.. ప్రస్తుతం ఈ షో ముగియడంతో సుమా అడ్డా అంటూ మరొక కొత్త షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 7 వ తేదీ నుంచి ప్రతి శనివారం ప్రసారం కాబోతున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ లో సంతోష్ శోభన్ “కళ్యాణం కమనీయం” సినిమా టీం వచ్చి సందడి చేసింది . దీని తర్వాత ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి తో కలిసి వచ్చినట్లు అందుకు సంబంధించిన ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ షో కోసం ఒక ఎపిసోడ్ కి ఈమె ఎంతో పారితోషకం తీసుకుంటుంది అనే వార్త ఒకటి లీక్ అయింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సుమా ఒక్కో ఎపిసోడ్ కు మిగిలిన లేడీ యాంకర్ల కంటే ఈమె దాదాపుగా రూ.60 వేలకు పైగా పారితోషకం ఎక్కువగా చార్జ్ చేస్తుందట. ఇలా సుదీర్ఘకాలంగా తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటుంది సుమ. మరి ప్రస్తుతం తాను హోస్టుగా చేస్తున్న సుమ అడ్డా షో కి ఒక్కో ఎపిసోడ్ కు రూ.1.60 లక్షలు పారితోషకంగా తీసుకుంటుందట. అంటే నెలకి నాలుగు ఎపిసోడ్లకు గాను రూ.6.40 లక్షలు తీసుకుంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త చాలా హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version