ఇండియన్ ఆర్మీకి 117 ఎకరాలు..నటుడు సుమన్ కీలక ప్రకటన !

-

ప్రముఖ టాలీవుడ్‌ నటుడు సుమన్‌.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌ మొదట్లో… చాలా సినిమాల్లో హీరోగా నటించిన సుమన్‌.. ప్రస్తుతం.. తండ్రి, మామ, స్పెషల్‌ గెస్ట్‌ పాత్రల్లో నటుడు సుమన్‌ కనివిందు చేస్తున్నారు. ఇక సినిమాలు చేస్తూ… సామాజిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అయితే.. తాజాగా నటుడు సుమన్‌ ఇండియాన్‌ ఆర్మీకి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ గా మారాయి.

ఈ వార్తలపై తాజాగా సుమన్‌ స్పందించారు. సామాజిక మాధ్యమా ల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. అదంతా ఫేక్‌ ప్రచారమని.. సుమన్‌ క్లారిటీ ఇచ్చారు. ఇండియన్‌ ఆర్మీకి ఇచ్చినట్లుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని.. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని వెల్లడించారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విష యాన్ని చెబుతానని చెప్పారు. ఇలాంటి ఫేక్‌ వార్తలు నమ్మొద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version