సుమన్ నువ్వు చాలా చిన్నోడివి.. నీ కెపాసిటీ ఎంత..? : జగ్గారెడ్డి

-

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.బాల్క సుమన్ దగ్గరే మాత్రమే చెప్పు ఉందా..? మా మెట్టు సాయి దగ్గర లేదా..? అని తన అనుచరుడు మెట్టు సాయి బూటును పైకెత్తి చూపిస్తుండగా.. జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిలగానివి.. పిలగాని తీరు ఉండాలని ఆయన అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కి మా మెట్టుసాయి చెప్పు చూపెడతాడు అని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడటం తప్పు కదా అని అన్నారు.

 

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఎప్పుడైనా అలాంటి విమర్శలు చేశామా మండిపడ్డారు. అంత అత్యుత్సాహం ఏందని బాల్క సుమన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ నువ్వు ఛాన చిన్నోడివి.. నీ కెపాసిటీ ఎంత..? అని మండిపడ్డారు . ఉద్యమ సమయంలో నువ్వే కొంత మందిని చంపి ఆత్మహత్యలుగా చిత్రికరించావని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పై చెప్పు చూపెట్టగానే పెద్దోడివి ఐతవా..?అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version