ఆ సినిమాలో నటించి తప్పు చేశా… సుమంత్..!

-

  • టాలీవుడ్ కింగ్ నాగార్జున, సుమంత్ నిజజీవితంలో మామ అల్లుడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి బాలశేఖరన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహమంటే ఇదేరా సినిమాలో ఫ్రెండ్స్ ల నటించారు. ఎన్నో అంచనాలతో థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఫ్రెండ్స్ అనే సినిమాను తెలుగులో స్నేహమంటే ఇదేరా పేరుతో రీమేక్ చేశారు.

నిజ జీవితంలో మామ అల్లుళ్ల ను దర్శకుడు ఫ్రెండ్స్ లా చూపించడం వల్ల ఈ సినిమా ప్లాప్ అయింది అంటూ సుమంత్ కామెంట్ చేశారు. ఒకానొక సందర్భంలో సుమంత్ ఈ సినిమాలో నటించి తప్పు చేశాను అని తెలియజేశాడు. అది మాత్రమే కాకుండా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసు అని సినిమా తెలియజేశాడు. సినిమా షూటింగ్ సమయంలోనే ఈ సినిమా చేసి తప్పు చేశాను అని అనుకున్నాను, కాకపోతే అప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి అవడంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక అలాగే కంటిన్యూ చేశాను అని సుమంత్ తెలియజేశాడు.

ఈ సినిమా ద్వారా నిర్మాతలు కూడా చాలా నష్టపోయారు అని ఈ సందర్భంగా సుమంత్ చెప్పుకొచ్చాడు. స్నేహమంటే ఇదేరా సినిమాలో భూమిక హీరోయిన్ పాత్రలో నటించగా ప్రత్యూష మరో కీలకమైన పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే సుమంత్ ప్రస్తుతం మళ్లీ మొదలైంది సినిమాలో నటించాడు. ఈ సినిమా జీ ఫైవ్ ఓటిటి లో ఫిబ్రవరి 11వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version