సునీత చంద్రబాబుతో చేతులు కలిపారు – ఎంపీ అవినాష్ రెడ్డి

-

ఏప్రిల్ నెలాఖరులోగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీంకోర్టు సిబిఐ ని ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేసింది సిబిఐ. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు నేడు ఉదయం పులివెందులలో అదుపులోకి తీసుకున్నారు.

అయితే తండ్రి అరెస్టుపై తాజాగా అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. వైయస్ వివేకా హత్య కేసులో తమను కావాలనే దోషులుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. సునీత, సిబిఐ ఒకే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని.. సునీత, సిబిఐ ఒక్కటేనని అన్నారు. అంతేకాదు సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపించారు అవినాష్ రెడ్డి. దస్తగిరి వాంగ్మూలాన్ని, వాచ్మెన్ రంగన్న చెప్పిన విషయాలను కూడా సిబిఐ పట్టించుకోవట్లేదన్నారు.

దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారని.. విచారణను సిబిఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకు వెళుతున్నారని ఆరోపించారు. ఏడాది వరకు ఒకలా ఉన్నా.. ఒక్కసారిగా సునీత వెర్షన్ మారిపోయిందన్నారు. హత్య విషయం నాకంటే ముందు వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి తెలుసన్నారు అవినాష్ రెడ్డి. వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version