మార్చి 26వ తేదీన ప్రారంభం అయిన.. ఐపీఎల్ 2022 మెగా టోర్నీ… చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 24 మ్యాచ్ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు అందరినీ ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 25 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబై లోని బ్రబోర్న్ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, అబ్దుల్ సమద్/శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
కోల్ కతా నైట్ రైడర్స్ : వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే/ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్, సామ్ బిల్లింగ్స్/షెల్డన్ జాక్సన్, రింకూ సింగ్/రసిఖ్ సలామ్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి