సూపర్ స్టార్ కృష్ణ హోం టూర్..ఇంద్రభవణం కూడా తక్కువే..!!

-

ఈమధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలో హోమ్ టూర్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు ఇప్పటివరకు హోమ్ టూర్స్ చేస్తూ తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత మంది సబ్స్క్రైబర్లను పొందిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల కూతుర్లు కూడా హోమ్ టూర్లు చేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.ఇక ఇటేవల మంచు లక్ష్మి తమ తండ్రి కుటుంబానికి సంబంధించిన ఇళ్ళన్నింటికి హోమ్ టూర్ నిర్వహించి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.. ఇక ఈ క్రమంలోని సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల కూడా తన తండ్రిగారి ఇంటిని హోమ్ టూర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం యూట్యూబ్లో ఇది ఒక ట్రెండీ వీడియోగా మారడం గమనార్హం.

ఇక మంజుల షేర్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు మాత్రం ఇంద్రభవనానికి మించి అన్న రేంజ్ లో ఉంది అని తెలుస్తోంది. ఇక ఇంటిలో సకల సౌకర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇంట్లో అలాగే ఇంటి చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా కృష్ణ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఇంటిలో అలాగే గార్డెన్ లో ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా నెటిజన్ లను చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కృష్ణ గారి ఇంట్లో హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్ , పిల్లల కోసం ప్లేయింగ్ రూమ్స్ ఉండడంతో పాటు విశాలమైన హాల్, అన్ని రకాల పండ్ల తోటలు, కూరగాయల తోటలు, పక్షుల కిలకిల రావాలు ఒక్కటేమిటి అన్నీ కూడా చూపు తిప్పుకొని విధంగా ఉండడం గమనార్హం. లివింగ్ రూమ్ విషయానికి వస్తే కృష్ణ గెలుచుకున్న పథకాలతో పాటు విజయనిర్మల విగ్రహాలు, ఫోటోలు కూడా అక్కడ దర్శనమిస్తాయి.

ఫస్ట్ ఫ్లోర్లో నాన్న ఉంటారని అది చూపించడం అసాధ్యమని.. వీలైతే రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తానని మంజుల వెల్లడించింది .ఇక ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తూ ఉండటంతో నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version