సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం.. లైవ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

-

సుప్రీం కోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రోజువారీ కార్యకలాపాలను ఇవాళ్టి నుంచి లైవ్​ ద్వారా ప్రసారం చేస్తోంది. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్​లో చూసేందుకు సుప్రీం కోర్టు వీలు కల్పించింది. త్వరలోనే దీనికి సంబంధించి సొంత వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు. లైవ్​ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. https://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి.

అత్యున్నత న్యాయస్థానంలో జరిగే కార్యకలాపాల కాపీరైట్‌ హక్కులను.. యూట్యూబ్‌ వంటి ప్రైవేట్‌ వేదికలకు అప్పగించకూడదంటూ బీజేపీ మాజీ నేత కేఎన్‌ గోవిందాచార్య తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రారంభ దశలోనే యూట్యూబ్​ ఉపయోగిస్తామని.. కాపీరైట్‌ సమస్యలపై దృష్టిసారిస్తామని పేర్కొంటూనే.. ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రత్యేకంగా సొంత వేదిక ఏర్పాటు చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 17కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version