లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసును దసరా శెలవులు తర్వాత ప్రారంభిస్తామని చెప్పిన సుప్రీం కోర్టు… అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యు.పి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత వరకు యుపి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని సుప్రీం కోర్టు సీరియస్ అయింది.
ఇక ఇవాళ విచారణ లో యు.పి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే. ఈ కేసులో సిబిఐ తో విచారణ జరిపించేందుకు అంత సుముఖత ను వ్యక్తం చేయలేదు సుప్రీం కోర్టు ధర్మాసనం.
సిబిఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదనేందుకు గల కారణాలు ఏమిటో మీకు బాగా తెలుసంటూ సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే నుద్దేశించి ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యనిచంఆరు. లఖింపూర్ ఘటన అత్యంత సున్నితమైన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే సరైన రీతిలో చర్యలు తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఇక ఈ కేసును వాయిదా వేసింది సుప్రీం కోర్టు.