వినూత్న పాత్రలతో అలరించే నటుడు హీరో సూర్య. తనకు మంచి పాత్ర పడాలే కానీ.. తనలో ఉన్న నటనను బయటకు తీస్తాడు. తాజాగా ఓటీటీలో విడుదలైన ’జై భీమ్ ‘ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించాడు. ఈ మూవీపై విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. లాయర్ పాత్రలో సూర్య జీవించాడు. ఆడియన్స్ నుంచి సినిమాకు విశేష ఆదరణ లభించింది. టీజే జ్ఞానవేల్ డెరెక్షన్ లో సూర్య సతీమణి జ్యోతిక రూపొందిన జై భీమ్ సినిమాను పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ప్రశంసించారు. ఇదిలా ఉంటే దీనిపై కొన్ని వివాదాలు కూడా పుట్టకోచ్చాయి.
1995 జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా లాయర్ చంద్రు జీవితం ఆధారంగా జై భీమ్ చిత్రాన్ని తీశారు. పోలీసుల అణచివేతకు గురైన బాధితుడి భార్య పోరాడేందుకు సహాయ పడే లాయర్ గా సూర్య మెస్మరైజ్ ఫెర్ఫామెన్స్ చేశాడు. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ సినిమాల జాబితాలో జై భీమ్ ఏకంగా మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. సుమారు 53,000 ఓట్లు, 9.6 రేటింగ్‌తో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.
తాజాగా జై భీమ్ సినిమా మరో ఘనత సాధించింది. ఉత్తమ నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయింది ‘జై భీమ్’. ఆస్కార్ అవార్డ్ తర్వాత అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో గోల్డెగన్ గ్లోబ్ పురస్కారాలని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అనే సంగతి తెలిసిందే.