ఆప్ నా పై కుట్రలు చేస్తోంది.. స్వాతిమలివాల్ సంచలన ఆరోపణ

-

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై కేజ్రివాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేయగా.. ఈ అంశం తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఆప్ నేతలపై ఒత్తిడి చేస్తోందన్నారు. అంతేగాక తన వ్యక్తిగత ఫొటోలను లీక్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆమె బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘ఒక సీనియర్ నాయకుడి నాకు ఫోన్ వచ్చింది. స్వాతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయాలని, తనపై హీనంగా మాట్లాడాలని ఒత్తిడి పెరుగుతున్నట్టు నాతో చెప్పారు.నాకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ఒకరికి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే బాధ్యతను, మరొకరికి ట్వీట్ చేసే బాధ్యతను అప్పగించారన్నారు. నిందితులకు సన్నిహితంగా ఉన్న కొందరు రిపోర్టర్లు నకిలీ స్టింగ్ ఆపరేషన్లు కూడా చేస్తున్నారని తెలిపారు. కానీ ఎందరు వచ్చినా ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ‘నా ఆత్మగౌరవం కోసం పోరాటం ప్రారంభించాను. పోరాడుతూనే ఉంటాను. న్యాయం జరిగే వరకు కొట్లాడుతాను’ అని పేర్కొన్నారు. మరోవైపు స్వాతి మలివాల్ దాడి కేసులో నిందితుడైన బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు బుధవారం ముంబై నుంచి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version