ఉత్కంఠగా సాగిన ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తమిళనాడులో విజయం సాధించింది. చివరి బాల్ కు సిక్సర్ కొట్టి తమిళనాడును గెలిపించాడు షారుఖ్ ఖాన్. దీంతో రెండో సారి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విజయం సాధించింది. అంతకుముందు 2006-07లో, ప్రస్తుతం 2020-21 లో తమిళనాడు విజయం సాధించింది.
కర్ణాటకతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో చివరి బంతికి తమిళనాడు విజయాన్ని అందుకుంది. చివరి బంతికి 5 పరుగులు అవసరం ఉండగా… బ్యాటర్ షారుఖ్ ఖాన్ సిక్స్ కొట్టి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కర్ణాటక 152 పరుగులు చేసింది. చేధనలో బరిలో దిగిన తమిళ నాడును మొదట్లో కట్టడి చేసిన కర్ణాటక బౌలర్లు షారుఖ్ ఖాన్ ధాటికి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కేవలం 15 బంతుల్లోనే 33 పరుగులు చేసి తమిళ నాడు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
స్కోర్లు: కర్ణాటక 151/7 (అభినవ్ మనోహర్ 46, ప్రవీణ్ దూబే 33; సాయి కిషోర్ 3-12); తమిళనాడు 153/6 (ఎన్ జగదీషన్ 41, షారుక్ ఖాన్ 33*; కెసి కరియప్ప 2-23).
When cricket meets bolllywood , #Sharukhkhan – the real hero of #SMATFinal.#SyedMushtaqAliTrophy #TNvKAR pic.twitter.com/q4JPsCbTcY
— LeoTamil (@Leotamil14) November 22, 2021