T20 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, USA మధ్య మ్యాచ్ జరుగుతుంది.అమెరికాతో మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.USAతో మ్యాచ్లో భారత బౌలర్ అర్ష్ దీప్ సింగ్ విజృంభించారు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. పదునైన బంతులతో ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. అర్షీ దీప్ కు ఆల్ రౌండర్ పాండ్య, అక్షర్ పటేల్ తోడవడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 110/8 రన్స్ మాత్రమే చేయగలిగింది. నితీశ్ కుమార్ 27 టాప్ స్కోరర్. ఇందులో విజేత సూపర్8కు చేరుతుంది. ఓడిన జట్టు మరో మ్యాచ్ ఆడి గెలిస్తే సూపర్ కు వెళుతుంది.
ఇక ఈ మ్యాచ్ లో బౌలర్ అర్షదీప్ సింగ్ అరుదైన ఘనత అందుకున్నాడు. తొలి బంతికే వికెట్ తీసి భారత్ తరపున టీ20ల్లో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.ఇప్పటివరకు ఏ భారత బౌలర్ టీ20 క్రికెట్ తొలి బంతికి వికెట్ తీయకపోవడం విశేషం. అమెరికా బ్యాటర్ జహంగీర్ ను అర్షదీప్ సింగ్ తొలి బంతికి ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ చేశాడు.