మ‌హిళ స్నానం చేస్తుండ‌గా న‌గ్న వీడియోలు తీసి.. ఆ త‌ర్వాత‌..!

-

మ‌హిళ స్నానం చేస్తుండగా ఒక ప్ర‌బుద్ధుడు న‌గ్న వీడియోలు తీసి బెదిరించాడు. త‌న‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాల‌ని ఇబ్బందులు పెట్టాడు. దీంతో బాధిత మ‌హిళ.. సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో.. పోలీసులు ఆ వ్య‌క్తిని ఆరెస్టు చేశారు. కాగ ఈ ఘ‌ట‌న తెలంగాణలోని జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కు చెందిన సాయి కృష్ణ‌.. ఇటీవ‌ల త‌న‌ బంధువుల శుభ కార్యానికి వెళ్లాడు. అక్క‌డ బంధువుల్లో ఒక మ‌హిళ న‌గ్నంగా స్నానం చేస్తుండ‌గా.. సెల్ ఫోన్ లో వీడియో తీశాడు.

అంతే కాకుండా.. ఈ వీడియోను బాధిత మ‌హిళ ఫోన్ కు వాట్సప్ చేశాడు. త‌నతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాల‌ని ఇబ్బంది పెట్టాడు. లేకుంటే.. ఈ వీడియోల‌ను అంద‌రికీ పంపిస్తాన‌ని బెదిరించాడు. , సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధిత మ‌హిళా సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను సాయం కోసం ఆశ్ర‌యించింది. దీంతో రాచ‌కొండ‌ సైబ‌ర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి సాయి కృష్ణ‌ను అరెస్టు చేసి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అత‌న్ని రిమాండ్ కు త‌ర‌లించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version