మూడ్ ని ఇలా బూస్ట్ చెయ్యచ్చు..!

-

ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మూడ్ ని మార్చుకోవచ్చు. ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా తీసుకునే ఆహారం ఆరోగ్యవంతమైనది అయ్యుండాలి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మూడ్ ని బ్యాలెన్స్ చేస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఆనందం, బాధ, కోపం, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలా చాలా రకాల మూడ్స్ మనకి ఉంటాయి. అయితే మూడ్ ని బూస్ట్ చేసుకోవాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి.

 

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడులో సెరటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మూడ్ ని స్టేబుల్ గా ఉంచుతుంది.

గ్రీన్ టీ:

బరువు తగ్గడానికి గ్రీన్ టీ బాగా ఉపయోగ పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షన్ ని బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగ పడుతుంది.

బెల్ పెప్పర్:

ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి దీనిని తీసుకోవడం వల్ల సెరోటోనిన్ అంది మూడ్ బాగుంటుంది.

ఒమేగా త్రీ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు:

ఒమేగా త్రీ ఎక్కువ ఉండే సాల్మన్, నట్స్ వంటివాటిలో మూడ్ ని మార్చే గుణాలు ఉంటాయి డిప్రెషన్ వంటి సమస్యలు కూడా తొలగిస్తాయి.

గింజలు:

గింజల్లో విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. తక్కువ మెగ్నీషియం ఉన్నప్పుడు డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి గింజల్ని తీసుకుని మూడ్ ని మార్చుకోండి అలాగే ఆకుకూరలు కూడా బాగా ఉపయోగ పడతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version