మహిళల హక్కులపై ఐక్యరాజ్య సమితి, హక్కుల సంఘాలు ఉదాసీనతలో ఉండటంతో సిగ్గు చేటని, ఆప్గన్ లో మహిళల పరిస్థితికి తాలిబన్లతోొ పాటు ఐక్యరాజ్య సమితి కూడా కారణం అంటూ పెద్ద ఎత్తునా నినాదాలు చేస్తూ మంగళవారం నిరసనలు తెలిపారు. దేశంలో మహిళలు చదువుకోకుండా పాఠశాలలను మూసివేయడంతో కాబూల్ లోని యూఎన్ అసిస్టెన్స్ మిషన్ కార్యాలయం ముందు మహిళలు నిరసన తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షలాది బాలికలు తరగతి గదులకు తిరిగి రావాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని నిరసనకారులు వెల్లడించారు.
తాలిబన్లకు నిరసన సెగ.. హక్కుల కోసం రోడ్డెక్కిన ఆప్గన్ మహిళలు
-