ఆర్ఆర్ఆర్ అనే విజువల్ వండర్ కోసం తారక్ ఎంతగానో కృషి చేశారు.చరణ్ తన స్థాయిని మించి పనిచేశారు. పనిచేశారు అని అనడం కన్నా అంకితం అయ్యారు అని చెప్పడమే బెటర్. ఈ ఇద్దరి సమష్టి శ్రమ ఫలితం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమాలో తెలంగాణ యాసలో తొక్కుకుంటూ పోవాలె అని డైలాగ్ ఒకటి పలికి తారక్ అభిమానులను ఉర్రూతలూగించారు. అదేవిధంగా సినిమా ప్రమోషన్ లో డీజే టిల్లు డైలాగ్ ఒకటి పలికి అందరినీ నవ్వించారు ఆయన. అసలు ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నింటిలో తారక్ నవ్విస్తూ నవ్వుతూ మిగతా వారితో అల్లరి చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.
సినిమా సినిమాకు స్థాయి పెంచుకోవడం అన్నది ఓ డైరెక్టర్ తనంతట తాను చేస్తున్న కృషికి సంకేతం. అంతేకాదు ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారు ఏ స్థాయికి ఎదిగి పనిచేస్తున్నారన్నది ఇవాళ అందరి అగ్రహీరోల అభిమానులనూ ఆనందింపజేస్తున్న మరియు ఆలోచింపజేస్తున్న విషయం.అందుకే రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అనగానే ఎన్నో అవకాశాలు సైతం వదులుకునేందుకు ఇవాళ అగ్ర తారలంతా సిద్ధంగా ఉన్నారంటే అది అతిశయం కాదు.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ కొన్ని ఆసక్తిదాయక ఘటనలు చెబుతున్నారు.ఇదే సందర్భంలో షూటింగ్ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్స్ ను కూడా ఆయన పంచుకుంటున్నారు. ఎన్నడూ లేని హుషారుగా ఉన్నారు తారక్ మరియు చరణ్ కూడా ! సినిమా ఫలితంపై మంచి కాన్ఫిడెన్స్ తో కూడా ఉన్నారు. ఈ సినిమా హిట్ అండి..మా నమ్మకం వమ్ము కాదండి అని కూడా అంటున్నారు వారిద్దరూ! మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడడంతో తమకు టెన్షన్ పెరిగిపోతున్నా రిజల్ట్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో నే ఉన్నామని అంటున్నారు వారిద్దరూ !
ముఖ్యంగా రాజమౌళి ని ఉద్దేశించి ఎన్నో విషయాలు తారక్ చెబుతున్నారు. షూటింగ్ కు సంబంధించి ముఖ్యంగా పని విషయమై రాజమౌళి తీసుకునే శ్రద్ధకు సంబంధించి ఇలా ఒక్కటేంటి ఎన్నో చెబుతున్నారు. పెర్ఫక్షన్ కోసం ఆయన పడే పాట్లు గురించి పెట్టే తిప్పలు గురించి ఇలా ఎన్నో ! అదేవిధంగా ఆయనతో తాము వర్క్ చేస్తున్న సందర్భంలో ఏ విధంగా నటుడిగా ఎదిగేందుకు కృషి చేశామన్న విషయం గురించి ఇంకా ఎన్నో ! ఇవన్నీ చెబుతూనే ఓ మాటను ఓ సందర్భంలో పలికారు.
అట్లుంటది మనతోటి అంటూ ఓ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా డీజే టిల్లు డైలాగ్ ఒకటి వినిపించారు. షూటింగ్ ను ఎంత కష్టంగా అనిపించి చేసినా ఇవాళ రిజల్ట్ బాగుండడం తమ ఆనందాలకు అవధులే లేవని కూడా అంటున్నారు తారక్ . ఆ కుటుంబానికి తామిద్దరం రుణపడి పోయామని అంటున్నారు. రాజమౌళి ఎంత గొప్పగా పనిచేసినా ఆయన ఆలోచనలకు అనుగుణంగా అంకితం అయి పనిచేసే వాళ్లు కూడా ఉండాలని అందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని ఆర్ఆర్ఆర్ గురించి వివరిస్తూ భావోద్వేగ సంబంధ విషయాలు చెప్పారు.
– డైలాగ్ ఆఫ్ ద డే – మన లోకం ప్రత్యేకం