బెజవాడ పంచాయితీ..సీటు ఎవరికి?

-

తెలుగుదేశం పార్టీలో బెజవాడ పంచాయితీ నడుస్తూనే ఉంది. మొదట నుంచి ఇక్కడ టి‌డి‌పి నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ముఖ్యంగా విజయవాడ(బెజవాడ) ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా కీలక నేతలు పనిచేస్తూనే ఉన్నారు. దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి వారు కేశినేనికి యాంటీగానే ఉన్నారు. ఇప్పుడు కేశినేని సోదరుడు కేశినేని చిన్ని సైతం..తన అన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆయన దక్కించుకోవాలని చూస్తున్నారు.

అయితే ఇప్పటికే టి‌డి‌పి అధిష్టానానికి, కేశినేనికి మధ్య గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి సీటు కేశినేని నానికి ఇవ్వరనే ప్రచారం సాగుతుంది. ఇటు చిన్ని సీటు కోసం ట్రై చేస్తున్నారు. నానికి వ్యతిరేకంగా ఉన్న వారంతా..చిన్నికి మద్ధతు ఇస్తున్నారు. చిన్ని సైతం బెజవాడ రాజకీయాల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. సీటు ఆయనే దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇటు బాబు కూడా చిన్ని వైపే ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ మధ్య నాని సైతం పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఇటీవల చంద్రబాబు గుడివాడ పర్యటనకు రాగా, ఆయనతో పాటు నాని కూడా వచ్చారు. దీంతో నాని, చిన్నిల మధ్య సీటు పోటీ మొదలైంది. తాజాగా చిన్ని సీటు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవకాశం ఇస్తే..నెక్స్ట్ ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేస్తానని చిన్ని ప్రకటించారు.

అదే సమయంలో నానికి సీటు ఇచ్చిన, ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో బెజవాడ సీటుపై చర్చలు మొదలయ్యాయి. ఇపుడు ఆ సీటు ఎవరికి ఇస్తారని తమ్ముళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇక ఏదేమైనా ఫైనల్ డెసిషన్ చంద్రబాబు తీసుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news