ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు రోహిత్ సేన ఇవాళ తెల్లవారుజామున ఆస్ట్రేలియాకు బయల్దేరింది. ప్రపంచ కప్ టోర్నీకి బయల్దేరే మందు భారత బృందం సభ్యులు, సహ క్రికెటర్లతో కలిసి దిగిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఈ పర్యటనకు ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన టీ20 సిరీస్‌ల్లో విజయకేతనం ఎగురవేసి రోహిత్ సేన ఉత్సాహంగా ఉంది.
భారత్ బౌలర్ల ఆటతీరు డెత్ ఓవర్లలో నిరాశాజనకంగా ఉంది. ఇప్పటికే కీలక బౌలర్ బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కావడంతో టీమ్ కి మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరో వైపు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం డెత్ ఓవర్ల విషయంలో ధైర్యంగానే ఉన్నాడు. ‘డెత్ ఓవర్ల అంశం ఆందోళన కలిగించలేదు. అయితే మ్యాచ్ చివరలో జట్టు పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. డెత్‌లో బౌలింగ్, బ్యాటింగ్ చేయడం కష్టమే. కానీ.. కచ్చితంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
సూపర్ -12 దశకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిల్లో భాగంగా అక్టోబర్ 17న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న న్యూజిలాండ్‌తో తలపడనుంది.