తీన్మార్ మల్లన్న కేరాఫ్ చంచల్ గూడ… ఇదే రిపీట్ అవుతుందా?

-

తెలంగాణ సర్కార్ పైనా, కేసీఆర్ రాజకీయాలపైనా సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్నపై పలురకాల కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్ ను మంత్రులను టార్గెట్ చేసి “క్యూ న్యూస్” అనే యూట్యూబ్ చానెల్ ద్వారా తీన్మార్ మల్లన్న చేసే క్రిటిసిజం తెలంగాణలో చాలా పాపులర్. అయితే ప్రస్తుతం మల్లన్న పరిస్థితి కేరాఫ్ చంచలగూడ జైల్ లా తయారయ్యింది!

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

అవును… ఒక కేసులో బెయిల్ దొరికి ఇంటికి రాగానే.. మరోకేసులో మల్లన్నను లోపలేస్తున్నారు పోలీసులు! దీంతో… మల్లన్న ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదనే అనుకోవాలి! ఓ జ్యోతిష్యుడిని రూ.30 లక్షల డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయని.. మల్లన్నను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ అనంతరం ఆ కేసుకు సంబందించి బెయిల్ పై బయటకు వచ్చారు తీన్మార్ మల్లన్న. అయితే.. అలా బయటకు వచ్చారో లేదో.. పోలీసులు మల్లన్నను మళ్లీ అరెస్ట్ చేశారు.

తాజాగా నిజామాబాద్ లో కల్లు వ్యాపారి వద్ద మల్లన్న టీం.. డబ్బులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలపై మల్లన్నతోపాటు ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫలితంగా మల్లన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఫలితంగా… మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు!

అయితే… తీన్మార్ మల్లన్న విషయంలో వరుస అరెస్టుల సంగతి పై ఆన్ లైన్ లో స్పందిస్తున్నారు నెటిజన్లు. “పరిస్థితి చూస్తుంటే… ఇదొక కంటిన్యూస్ ప్రోసెస్ లానే కనిపిస్తుందనే కామెంట్లు” సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు. మరి నెటిజన్లు కామెంట్ చేస్తున్నట్లు ఇది ఒక కంటిన్యస్ ప్రోసెస్ ఆ… లేక, ఇక్కడితో ఆగిపోతుందా అన్నది తెలియాలంటే… మరో 14రోజులు ఆగాల్సిందే!!

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే అరెస్టుల పేరుతో వేధిస్తున్నార‌ని, ప్ర‌శ్నించే గొంతుక‌ల‌ను నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. త‌ప్పు చేసిన వారి సంగ‌తి చ‌ట్టం చూసుకుంటుంద‌ని, దానికి ఎవ‌రూ అతీతులు కారని ప్ర‌భుత్వ పార్టీ నేత‌ల మాట‌. అరెస్టుల‌తో మ‌ల్ల‌న్న‌ని ఆప‌లేర‌ని, ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌ని, మ‌ల్ల‌న్న స‌పోర్ట‌ర్స్ సోష‌న్ మీడియాలో వార్నింగులు ఇస్తున్నారు.

కాగా… ఏపీలో జగన్ సీఎం అయ్యాక, “సర్కార్ తో ఢీ అంటే ఢీ” అన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా ఇలానే వరుసగా అరెస్ట్ అయ్యారు. ఒక కేసులో బెయిల్ పై బయటకు రాగానే మరో కేసు పడేది! ఫలితంగా దాదాపు ఆరేడు నెలల పాటు జైల్లోనే ఉన్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version