రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. పోడు సమస్యలు, దళితబంధు పథకం వంటి పలు అంశాలపై మంత్రి వర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చింది. దళితబంధు పథకంపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మరింత విస్తరించి అర్హులకు లబ్ధి చేకూర్చాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు.
దళితబంధు పథకంపై కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న వంద మందితో పాటు ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. హుజూరాబాద్‌లో మొత్తంగా అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన 118 నియోజకవర్గంలోనూ లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించింది. గుర్తింపు ప్రక్రియను త్వరగా ముగించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.