breaking : తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల : ఇలా చెక్ చేసుకోండి..!

-

తెలంగాణ రాష్ట్ర ఎడ్ సెట్ ఫలితాలు విడుదల విడుదలయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాల లో 98.53 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.

ఈ పరీక్షకు 34 వేల 185 మంది హాజరయ్యారని.. ఇందులో ఏకంగా 33,683 మంది విద్యార్థులు అర్హత సంపాదించారని స్పష్టం చేశారు. ఇక ఉత్తీర్ణులైన వారిలో 25, 983 మంది అమ్మాయిలు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇక ఎడ్ సెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం…https://edcet.tsche.ac.in/ అనే వెబ్ సైట్ ద్వారా చూసుకోవచ్చన్నారు.

అలాగే ఈ తెలంగాణ ఎడ్ సెట్ పరీక్ష ఫలితాల్లో లో నల్గొండకు చెందిన తిమ్మిశెట్టి మహేందర్ కు మొదటి ర్యాంకు సాధించాడని పేర్కొన్నారు. మంచిర్యాల విద్యార్థిని ఎ. ప్రత్యూష కు రెండో ర్యాంకు వచ్చిందని తెలిపారు. అలాగే పాట్నకు చెందిన రిషికేశ్ కుమార్ శర్మకు మూడో ర్యాంకు వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 206 కాలేజీల్లో 18 వేల సీట్లు ఉన్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version