తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. అధికారులు ఈ పరీక్షా ఫలితాలను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఉన్న విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. జూలై 26న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,578 మంది హాజరుకాగా వీరిలో 30,580 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన అభిషేక్ మోహంతికి మొదటి ర్యాంక్ సాధించగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంజనేయులు రెండో ర్యాంక్ సాధించాడు. మేడ్చల్‌కు చెందిన ముకేష్‌కు మూడో ర్యాంక్, జనగామకు చెందిన మహేష్ కుమార్‌కు 4వ ర్యాంక్, మేడ్చల్‌కు చెందిన అర్హద్ అహ్మద్ ఐదో ర్యాంక్ దక్కించుకన్నాడు.
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్ ను ఓపెన్ చేయాలి. అనంతరం అభ్యర్థి తన పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే రిజల్ట్స్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఎడ్‌సెట్ ర్యాంక్ ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణలోని పలు కాలేజీల్లో రెండేళ్ల బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.