నేటి నుంచి తెలంగాణ విద్యాసంస్థలు పునః ప్రారంభం

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కేసీఆర్‌ సర్కార్‌ షాక్‌ ఇచ్చింది. ఇవాళ్టి నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు పునః ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవుల్లో భాగంగా.. జనవరి 8 వ తేదీ నుంచి విద్యాసంస్థలన్నీ మూత పడగా… కరోనా నేపథ్యంలో ఆ సెలవులను జనవరి 31 వ తేదీ వరకు పొడగిస్తూ.. కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంది.

ఇక.. నేటి నుంచి వాటిని మళ్లీ తెరిచేందుకు కేసీఆర్‌ సర్కార్‌ పచ్చ జెండా ఊపడంతో.. మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు రీ – ఓపెన్‌ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నాయి. విశ్వ విద్యాలయాలూ ప్రత్యక్ష తరగతులను ప్రారంభిస్తున్నాయి. కరోనా కేసులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తగ్గుముఖం పట్టుతుండటం తో… ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక విద్యాసంస్థల్లో… కరోనా నియమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్‌. విద్యార్తులు, టీచర్లు మాస్కులు, సానిటైజర్ తప్పనిసరి చేసింది సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version