TB వ్యాధిగ్రస్తులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

-

TB వ్యాధిగ్రస్తులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. టి బి వ్యాధి గ్రస్తులు పడే బాధ అంత ఇంత కాదు.. వారికి రోగం ప్రబలినప్పటి నుండి వారిలో రోజు రోజు ఆత్మవిశ్వాసం పోగొట్టుకొని, రోగ నిరోధక శక్తి తగ్గి కుమిలి పోతున్నారని తెలంగాణ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

ఎంతటి వ్యాధినైనా మనోధైర్యంతో నయం చేసుకోవచ్చు. వ్యాధిగ్రస్తులు ఆత్మ విశ్వాసం కల్పిస్తే అంతకు మించిన వైద్యం మరొకటి ఉండదని వెల్లడించారు. టి బి వ్యాధి గ్రస్తులకు బాధ్యత గల పౌరునిగా, ప్రజాప్రతినిధులు గా వారికి అండగా నిలుద్దాం..రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు తమ నియోజకవర్గాల్లో న్యూట్రిషన్ కిట్లు ఇవ్వాలని , టీబీ వ్యాధిగ్రస్తులకి అండగా నివాలని పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు. TB వ్యాధిగ్రస్తులకు అన్ని విధాలా అండగా ఉంటామని.. వారికోసం మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news