తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ !

వానాకాలం పంట ప్రతి గింజ కొంటామని.. ఆ దిశగా కేంద్రంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6540 ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని…. ఇప్పటి వరకు 1762 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు.

అధికారులు సూచించిన తేదీల్లో రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. యాసంగిలో సాగయ్యే ప్రతి పంటను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు గంగుల. యాసంగి పంటను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్.సి.ఐ బేషరతుగా కొనాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపి బండి సంజయ్ కుమార్ యాసంగి పంటను కొనెలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. రైతు బంధు, 24 గంటల కరెంట్, కాళేశ్వరం జలాలతో తెలంగాణలో పంట దిగుబడి పెరిగిందన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ చేరిందని స్పష్టం చేశారు మంత్రి గంగుల.