బస్ భవన్ లో కీలక సమావేశం…. మళ్లీ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుదలపై చర్చ

-

మరోసారి తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయా..? అనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఆర్టీసీ ధరలు పెరిగాయి. టికెట్ రేట్లతో పాటు టోల్ టాక్స్ సంబంధించిన ఛార్జీలతో పాటు చిల్లర కష్టాలు తీరేందుకు ఛార్జీలను రౌండప్ చేశారు. ఇదిలా ఉంటే శనివారం రోజు బస్ భవన్ లో కీలక భేటీ జరిగింది. బస్ భవన్ లో టీఆఎస్ఆర్టీసీ బోర్డ్ సమావేశం అయింది. ఏడేళ్ల తరువాత బోర్డ్ తొలిసారి భేటీా అయింది. చార్జీలపెంపుతో పాటు పలు అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్, ఆర్థిక, రవాణా, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్, ఆర్ఎండ్ బీ ఈఎన్సీ తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా ఆర్టీసీ ఛార్జీలపైనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల పెరిగిన డిజిల్ రేట్లకు అనుగుణంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో డిజిల్ రేట్లతో ఆర్టీసీపై విపరీతమైన భారం పడుతోంది. దీంతో చాలా డిపోలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల నుంచి బయటపడాలంటే కేవలం ఛార్జీల పెంపే మార్గం అని అధికారులు ఆలోచిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news