సిద్దిపేట జిల్లాలో విషాదం, బంధువు కోసం వెళుతుంటే బావిలోకి దూసుకెళ్లిన కారు

-

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సిరిసిన గండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, స్థానికులు ఇద్దరిని కాపాడారు. కారులో మరొకరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది.

ఈ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండపాక స్టేజి వద్దకు వచ్చిన తమ బంధువులను ఇంటికి తీసుకురావడానికి సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి, ఆయన ఇద్దరు బావలు కనకయ్య, యాదగిరి కారులో బయలుదేరారు.

ఈ సమయంలో అతివేగంతో అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరినీ స్థానికులు బయటకు తీశారు. వారిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. కారులో చిక్కుకున్న సూరంపల్లి కి చెందిన యాదగిరి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలి యాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version