విషాదం.. కారులో ఊపిరి ఆడక చిన్నారి మృతి

-

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఈ మధ్య వర్షాలు రావడంతో కాస్త ఎండలు తక్కువ అయినప్పటికీ ఉక్కపోతతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ విషయం అంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఊపిరి ఆడక ఓ చిన్నారి కారులో మరణించింది. ఇది విషాదకరమైన ఘటన అనే చెప్పాలి.

వివరాల్లోకి వెళ్లితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాంబాయిగూడెంలో కారులో ఇరుక్కుని చిన్నారి కల్నిష మృతి చెందింది. ఆడుకునేందుకు ఇంటి నుంచి వెళ్లి పాప కారు ఎక్కింది. అయితే కారులో ఊపిరి ఆడకపోవడంతో చిన్నారి విగతజీవిగా మారింది. షాకింగ్ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version