వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి బలి.. మేయర్ అత్యవసర సమావేశం

-

హైదరాబాద్ లోని అంబర్పేట్ లో ఓ చిన్నారి వీధి కుక్కల బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డుపై వెళ్తున్న ఐదేళ్ల బాలుడిని వీధి కుక్కలు దారుణంగా కరిచి చంపేయడం అందరిని కలచివేసింది. ఈ విషాదకర ఉదాంతంపై తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. బాలుడి కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వీధి కుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ నేపథ్యంలో అంబర్పేట్ లో జరిగిన కుక్కల దాడి పై అధికార యంత్రాంగం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించిన గ్రేటర్ మేయర్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అధికారుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version