BREAKING: హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న తరుణంలో..ప్రమాదంలో గాంధీ భవన్ పడింది. భారీ వర్షం కురుస్తున్న తరుణంలో.. గాంధీ భవన్ లో గోడ కూలింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన విద్యుత్ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
సిటీలో 141 వాటర్ లాగింగ్ పాయింట్ ల వద్ద స్టాటిక్, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఆమ్రపాలి కమిషనర్. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదని ఆదేశించారు ఆమ్రపాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని… ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. హైడ్రా జిహెచ్ఎంసి సమన్వయంతో పని చేసి ఎవ్వరికీ సమస్యలు రాకుండా చూస్తామని తెలిపారు.