బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అభినవ్ భాస్కర్

-

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. మొన్న తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో యంగ్‌ లీడర్‌ పార్టీకి దూరం అయ్యారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అభినవ్ భాస్కర్. బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన కూడా చేశారు అభినవ్ భాస్కర్.

Abhinav Bhaskar resigned from BRS party

ఇక మొన్న సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఆత్మీయల సమ్మేళనం కార్యక్రమంలో వినయ్ భాస్కర్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు, 60వ డివిజన్ కార్పొరేట్ ర్ దాస్యం అభినవ్ భాస్కర్. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేసామని.. అయినా మా బాబాయ్ దగ్గర తమకు గుర్తంపు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అభినవ్ భాస్కర్. ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అభినవ్ భాస్కర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version